బీరు తాగడంలో ఆ ప్రధాని ఘనుడే!

Monday, April 20th, 2015, 01:11:35 PM IST


మందుబాబులకు ప్రేరణ కలిగించేలా ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఘన కార్యం నిర్వహించారు. వివరాలలోకి వెళితే రూల్స్ ఫుట్ బాల్ ఆటగాళ్ళు సిడ్నీ పబ్ లో ఇచ్చిన విందులో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ అందరి హర్షధ్వానాల మధ్య ఏడు సెకెన్ల కాలంలో గ్లాసు దించకుండా బీరును తాగేసారుట. ఇక ఈ దృశ్యం జనాలతో కిక్కిరిసి ఉన్న ఆ బార్ లోని కెమరాకు చిక్కడంతో టోనీ ఘనత ప్రపంచానికి తెలిసింది. కాగా ఒక ప్రధాని స్థానంలో ఉండి ఈ విపరీత చర్యలేమిటని కొందరు విమర్శకులు చిరాకు పడుతున్నప్పటికీ మరికొందరు మాత్రం ‘ఆహా.. ఏం తాగాడు’ అనుకుంటూ సంబరపడిపోతున్నారట. ఇక ఆస్ట్రేలియాలో ప్రజలు అమితంగా మద్యం సేవిస్తున్నారని ఇటీవల కాలంలో ప్రధాని టోనీ అబాట్ విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు అంతలా విమర్శించిన ప్రధాని ఇప్పుడు గ్లాసును దించకుండా మరీ మద్యం సేవించడం ఏమిటని విమర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.