జైలు లో పాన్ షాప్ కావాలి అంటున్న ఖైదీలు .. కోర్టుకెక్కారు

Tuesday, September 27th, 2016, 05:25:06 PM IST

jail
జైల్లో పాన్ తినడం , పాను వేసుకోవడం లాంటివిచేయ్యడం కోసం పాన్ షాప్ పెట్టాలి అని కోరుతున్నారు. తమలపాకులు, వక్కలు , సున్నం తదితర సామాగ్రి కావాలి అని కోరుతున్నారు. కనీసం అమ్ముకోడానికి పర్మిషన్ ఇవ్వండి అంటున్నారు ఖైదీలు. ఏకంగా ఈ విషయం మీద 11 మంది గౌహతీ సెంట్రల్ జైలు ఖైదీలు హై కోర్టు కి ఎక్కేసారు. వీరందరూ పలు నేరాల్లో శిక్ష అనుభవిస్తున్నవారే , కానీ తమ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని .. తాము అడుగుతోంది చాలా చిన్న కోరిక అని వారు వాదిస్తుండడం గమనార్హం. పాన్ నమిలితే తాము పునరుత్తేజితం అవుతామని వీరు తెలిపారు. కాగా, తాము పాన్ తినేందుకు అనుమతించాలని గత సంవత్సరం అక్టోబర్ లో 413 మంది ఖైదీలు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి కామ్ రూప్ (రూరల్)ను ఆశ్రయించగా, ఆయన ఖైదీల కోరికను తోసిపుచ్చారు. దీంతో వారిలో 11 మంది ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం మీద వీరు గతం లో జైల్లో ధర్నా కూడా చెయ్యగా లాయర్ ల సహాయం తో పోలీసులు వీరికి ఇది సాధ్యం అయ్యే మార్గాన్ని చూపించారు. త్వరలో తాము కేసు గెలుస్తాం అనీ తమ పాన్ షాప్ ఓపెన్ అవుతుంది అంటున్నారు ధీమాగా ఖైదీలు.

  •  
  •  
  •  
  •  

Comments