క‌న్ను గీటిన పాప‌ క్ర‌ష్ ఎవ‌రిపైనో తెలుసా?

Monday, February 19th, 2018, 03:46:48 PM IST

క‌న్నుగీటి ఓవ‌ర్‌నైట్ లో స్టార్‌డ‌మ్ సంపాదించిన ఏకైక క‌థానాయిక ప్రియా వారియ‌ర్‌. ఈ మ‌ల్లూ భామ క‌న్నుగీటుడుకు ప‌డిపోని వాళ్లే లేరు. ఇటు టాలీవుడ్ స్టార్లు అల్లు అర్జున్‌, నిఖిల్ అంత‌టివారు అమ్మ‌డి లుక్‌కి ఫిదా అయిపోయారు. నిఖిల్ కాస్త అడ్వాన్స్‌డ్‌గానే ప్రియాకి త‌న సినిమాలో ఆఫ‌ర్ ఇచ్చాడ‌న్న ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు బ‌న్ని సైతం ప్రియా వారియ‌ర్ అప్పియ‌రెన్స్‌కు ఫిదా అయిపోయాన‌ని చెప్పాడు. కేవ‌లం యువ హీరోలే కాదు.. 60 ప్ల‌స్ హీరో రిషీక‌పూర్ సైతం ప్రియా వారియ‌ర్ కుర్రాళ్ల గుండె కొల్ల‌గొట్టింది.. నీలో చాలా మ్యాట‌ర్ ఉంది అమ్మ‌డూ అంటూ మెచ్చేసుకున్నారు.

కేవ‌లం 24 గంట‌ల్లో 6ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్‌తో ఇన్‌స్టాగ్ర‌మ్‌లో టాప్ 3 సెల‌బ్రిటీగా పాపుల‌రైంది. క్రిస్టియానో రొనాల్డో, జెన్న‌ర్ కెయిలీ త‌ర్వాతి స్థానం ద‌క్కించుకుంది. స‌న్నీలియోన్‌, అనుష్క‌, ఆలియా భ‌ట్ .. వీళ్లంతా ఎప్పుడో ప్రియా దెబ్బ‌కు ప‌రార్ అయిపోయారు. అయితే ఇంత‌మంది ఫాలోయింగ్ ఉన్న ప్రియా తొలి క్ర‌ష్ ఎవ‌రిపైనో తెలిస్తే షాక్ తిన‌కుండా ఉండ‌రు. ఈ అమ్మ‌డి తొలి క్ర‌ష్ ఓ క్రికెట‌ర్‌పై. అత‌డు మ‌రెవ‌రో కాదు.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్‌.ధోని. అత‌డిపై తొలి క్ర‌ష్ ఏర్ప‌డింది. త‌న‌ని ఎప్ప‌టికైనా క‌లుసుకుని తీర‌తాను అని అంటోంది. అయితే ఎం.ఎస్‌.ధోనీ, విరాట్ కోహ్లీల‌ను ఈ అమ్మ‌డు క‌లుసుకున్నా ఏం ఉప‌యోగం..అదే ఎవ‌రైనా ఇంకా పెళ్లికాని క్రికెట‌ర్ అయితే బావుండేది! అంటూ ఫ్యాన్స్‌లో ఒక‌టే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్చ్‌.. 18 వ‌య‌సులోనే ఈ మ‌ల్లూ బ్యూటీ ఎన్ని సంచ‌ల‌నాలకు కార‌ణ‌మ‌వుతోందో!