సెన్సేషనల్ వీడియో : అదరగొట్టిన ప్రియా ప్రకాష్ కొత్త వీడియో.. మీరూ చూసేయండి

Tuesday, May 1st, 2018, 05:14:57 PM IST

సోష‌ల్ మీడియా రాత్రికి రాత్రే ఒక్కసారిగా తళుక్కుమని మెరసిన అందాల తమిళ తార ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. త‌ను నటించిన తొలి చిత్రం ఒరు ఆదార్ ల‌వ్‌. ఈ మ‌ల‌యాళ మూవీలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ అనే పాట‌లో త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో యువ‌త గుండెల్లో బాణాలు దించింది ప్రియా. కనీసం 18 ఏళ్ళ కూడా నిండని ఈ భామ‌కి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫాలోవ‌ర్స్ రోజు రోజుకి ఇంతింతై కొండంతై అన్నట్టుగా పెరుగుతూ పోతున్నారు. తాజాగా ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌తో అభిమానుల ముందుకు వ‌చ్చిన ప్రియా ఇటివల మ‌రో వీడియోతో నెటిజన్స్ ని ఉర్రూతలూగిస్తున్నది. త‌న కో స్టార్ నుండి లెట‌ర్ అందుకున్న ప్రియా వెంట‌నే ఓ చిరుమందహాసంతో ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చి గుండెలు జిగేల్‌మ‌నిపించింది. ఈ వీడియో కూడా ఫ్యాన్స్‌కి మ‌రో ట్రీట్ అవుతుంద‌ని అంటున్నారు. ఈ అమ్మ‌డు న‌టించిన ఒరు ఆదార్ ల‌వ్ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్నా ప‌లు కార‌ణాల వ‌ల‌న ఇంకా వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

ఇప్పుడు ఈ చిత్రంలోని 40 శాతం స‌న్నివేశాల‌ని రీషూట్ చేయాల‌ని చిత్ర బృందం భావించింద‌ట‌. ఒరు ఆదార్ మూవీలో మొత్తం న‌లుగురు హీరోయిన్స్ ఉండ‌గా అందులో ప్రియా వారియ‌ర్ ఒక‌రు. సినిమాలో ఆమె పాత్ర కేవ‌లం 15 నుండి 20 నిమిషాలు మాత్ర‌మే ఉంటుంద‌ట‌. అయితే క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ తో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన ప్రియా పాత్ర‌ని కాస్త పెంచి మూవీపై జ‌నాల‌లో ఆసక్తిని క‌లిగించాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. ఇందుకోసం రీ షూట్ కూడా చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని టాక్‌. మ‌రో నాలుగు నెల‌ల త‌ర్వాత సినిమా రిలీజ్ అవుతుంద‌ని స‌మాచారం. కానీ కచ్చితంగా నాలుగు నెలల తర్వాత రీ షూట్ అవుతుందా లేక కథని ఇంకాస్త పెంచి ప్రియానే మెయిన్ రోల్ గ చేసి తెర్కేక్కిస్తారా అన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ కాకముందే ప్రియా కి అటు బాలీవుడ్ నుండి ఇటు టాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ప్రియా మాత్రం మొదటగా తను చేసిన సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ వేరే సినిమాల వైపుకు దృష్టి మళ్ళించాలని ఆలోచనలో ఉందట.