క్రేజీ వీడియో : ప్రియా వారియర్ సినిమా టీజర్ వచ్చేసింది గా…

Saturday, May 19th, 2018, 12:39:31 PM IST

ఓవర్ నైట్ స్టార్ గా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ గురించి నెటిజన్స్ కు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క ఎక్స్ ప్రెషన్ తో కుర్ర కారు గుండెల్లో గిటారు ధ్వనులు మోగించిన ప్రియా ఇప్పుడు మలయాళ టాప్ స్టార్ గా మారిపోయింది. ఒరు ఆదర్ లవ్ అనే చిత్రంలో ప్రియా మాణిక్య మలరాయ పూవీ అనే పాటతో చిత్ర సీమకు పరిచయమై మంచి స్టార్ డం క్రియేట్ చేసుకున్న ఈ స్వప్న సుందరి సరసన రోషన్ అబ్దుల్ రహూఫ్ కథానాయకుడిగా నటించాడు. పోయిన ఫిబ్రవరీ నెలలో ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అనుకోని తరహాలో ఈ పాటకి మంచి రెస్పాన్స్ రావడం అందులోను ప్రియ నటించిన దానికి ఇంకా మంచి పేరు రావడంతో ప్రియా యాక్టింగ్ నువాడుకొని నిర్మాతలు మరిన్ని డబ్బులు గడించాలని చూసారు.

ఇదే నేపథ్యంలో ప్రియాకు సంబంధించి మరిన్ని సీన్లు యాడ్ చేసి వచ్చే సెప్టెంబర్ లో చిత్ర విడుదలకు సర్వత్రా సిద్దం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రావడం వల్ల ప్రోడ్యుసర్లు ఈ సినిమాను మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం భాషల్లో కూడా డబ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్దపడ్డారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తమిళ పాత తీజర్ ను ప్రియా తన ఇంస్టాగ్రామ్ నందు విడుదల చేసింది. ఈ టీజర్లో ప్రియా, రోషన్ ఒకరినొకరు చూసుకుంటూ, వారికి వారే చిలిపి సరసాలతో తెగ మురిసిపోతూ సిగ్గుపడటం చూపించారు. ఇంకెందుకు మరి ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ కన్నేయండి.

  •  
  •  
  •  
  •  

Comments