ప్రియా వారియర్ కోలీవుడ్ ఎంట్రీ ఖరారు ?

Friday, April 13th, 2018, 10:03:39 AM IST

ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయినా వీడియొ ఏదయ్యా అంటే .. అందరు చెప్పేది ప్రియా వారియర్ గురించే. ఓ సినిమా ట్రైలర్ లో ఈ అమ్మడు కన్ను గీటి .. అందరి హృదయాలను బద్దలు కొట్టింది. ఓరు ఆధార్ లవ్ పేరుతొ తెరకెక్కిన ఈ సినిమా సెట్స్ లో ఉండగానే ఈ రేంజ్ లో క్రేజ్ రావడం మాములు విషయం కాదు. ఇక ఈ అమ్మడితో సినిమాలు తీయడానికి పలు బాషల దర్శక నిర్మాతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియా వారియర్ కోలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. సూదుకవ్వమ్, కాదళం కాదంగా పోగుమ్ వంటి సినిమాలతో దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న నలన్ కుమార స్వామి తెరకెక్కించే తదుపరి సినిమాలో ప్రియా వారియర్ ని హీరోయిన్ గా తీసుకున్నారట. కోలీవుడ్ లోకి ప్రియా ను గ్రాండ్ గా లాంచ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు, థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కే ఈ కథ బాగా నచ్చడంతో ప్రియా వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

  •  
  •  
  •  
  •  

Comments