ఆ విషయంలో ప్రియమణి ఆశలు నెరవేరేనా ?

Tuesday, April 24th, 2018, 10:17:03 AM IST

గ్లామర్ హీరోయిన్ గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ ప్రియమణి ఒక్క గ్లామర్ కాదు నటనలోనూ తన సత్తా చాటి నటిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ వరుస పరాజయాల పాలవడంతో కొత్త అవకాశాలు తగ్గాయి .. దాంతో టివి షో లకు జడ్జ్ గా మారింది. అయితే తాజాగా ఓ కత్తిలాంటి అవకాశం రావడంతో ఈ అమ్మడు ఆ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. పైగా ఆ పాత్రతో మళ్ళీ హీరోయిన్ గా తన క్రేజ్ పెరగడం ఖాయమనే ఆలోచనలో ఉంది. ఇంతకీ ప్రియమణిని అంతగా ఇంపాక్ట్ చేసిన పాత్ర ఏమిటో తెలుసా .. ఆ మధ్య తమిళంలో హీరో ధనుష్ నటించి సంచలన విజయం అందుకున్న కోడి సినిమా రీమేక్ కన్నడంలో చేసారు. తెలుగులో ధర్మయోగి పేరుతొ విడుదలైంది. అందులో త్రిష చేసిన నెగిటివ్ పాత్రలో ప్రియమణి నటించింది. ఈ పాత్రతో తనకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్న ఈ అమ్మడు ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తుంది. రవి హీరోగా నటించిన ఈ చిత్రానికి కన్నడ సినిమాటోగ్రాఫర్ అశోక్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments