యూ ట్యూబ్ రియాలిటీ షోలో రచ్చ చేయనున్న ప్రియాంక.. విల్ స్మిత్

Friday, May 4th, 2018, 06:20:09 PM IST

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోతో బిజీబీజీగా ఉన్న విషయం తెలిసిందే. బేవాచ్‌తో ఇంటర్నేషనల్ స్టార్‌డమ్ సంపాదించిన ప్రియాంక యూట్యూబ్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనుంది. సన్‌డాగ్ పిక్చర్స్ సంస్థ ‘ఇఫ్ ఐ కుడ్ టెల్ యు జస్ట్ వన్ థింగ్’ పేరుతో ఈ షో నిర్వహించనుంది. ఈ షోలో ప్రియాంక స్ఫూర్తివంతమైన ప్రజలను కలుసుకుని, ప్రపంచంలో మార్పులు తేవడానికి వారి సలహాలు తీసుకోనుంది.

దీంతోపాటు హాలీవుడ్ సూపర్‌స్టార్ విల్ స్మిత్‌తో ‘విల్‌స్మిత్..ది జంప్ ఆఫ్’ షో చేయనుంది. యూట్యూబ్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. ఈ షోలో భాగంగా విల్‌స్మిత్ ఎత్తైన గ్రాండ్ కెన్యాన్ ప్రాంతంలో హెలికాప్టర్ నుంచి బంగీ జంప్ చేసేందుకు ఒప్పుకున్నారని సన్‌డాగ్ పిక్చర్స్ తెలిపింది. ఇవేకాకుండా ప్రముఖ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు లీబ్రొన్ జేమ్స్‌తో ‘బెస్ట్ షాట్’ షో, డెమి లొవటోతో ‘సింప్లీ కాంప్లికేట్’, కెవిన్ హార్ట్స్ తో ‘వాట్ ది ఫిట్’ షోలను చేయనున్నట్లు సన్‌డాగ్ పిక్చర్స్ ప్రకటించింది.

  •  
  •  
  •  
  •  

Comments