అంతర్జాతీయ వేడుకల్లో తలుక్కుమన్న ముద్దుగుమ్మలు ప్రియాంకా, దీపిక

Tuesday, May 8th, 2018, 02:37:18 PM IST

బాలీవుడ్‌లో స్టార్ స్టేట‌స్ సాధించి హాలీవుడ్‌లోను త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న అందాల భామ‌లు దీపికా ప‌దుకొణే, ప్రియాంక చోప్రా. ‘ట్రిపులెక్స్: ది రిటర్న్‌ ఆఫ్‌ ది జాండర్ కేజ్‌’ చిత్రంతో దీపిక హాలీవుడ్‌కి ప‌రిచ‌యం కాగా, బేవాచ్ సినిమాతో ప్రియాంక చోప్రా హాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది. ప‌లు అంత‌ర్జాతీయ వేడుక‌లలో మెరిసిన ఈ ఇద్ద‌రు తాజాగా అమెరికాలోని న్యూ యార్క్‌లో జ‌రిగిన మెట్‌గాలా ఈవెంట్‌లో వెరైటీ డ్రెస్ ధ‌రించి అల‌రించారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌, కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్ ప్ర‌తి ఏటా మెట్‌గాలా పేరుతో ఈవెంట్ నిర్వ‌హిస్తుంటుంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే విరాళాలను ఛారిటీలకు వినియోగిస్తారు. అంత‌ర్జాతీయంగా ప్రియాంక‌, దీపికాకి పేరు రావ‌డంతో వారిద్ద‌రిని కూడా ఈ ఈవెంట్‌కి ఆహ్వానించారు నిర్వాహ‌కులు. దీపిక ఎరుపు రంగు గౌనులో కనిపించి సంద‌డి చేయ‌గా, ప్రియాంక ఫుల్ లెంగ్త్ డ్రెస్‌లో మెరిసింది. వీరిద్ద‌రు వెరైటీ డ్రెస్సుల‌తో అంద‌రి చూపుని త‌మ వైపుకి తిప్పుకున్నారు. ఇటీవ‌ల ప‌ద్మావ‌త్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన దీపికా త్వ‌ర‌లో స‌ప్నాదీదీ అనే ప్రాజెక్ట్ చేయ‌నుంది. ఇక గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక క్వాంటికో సిరీస్‌తో పాటు ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్‌’, ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ చిత్రాల‌తో బిజీగా ఉంది.

Comments