గోల్ 2030.. మ‌హిళ‌ల‌పై పీసీ విజ‌న్‌?

Friday, April 13th, 2018, 12:19:22 AM IST

`క్వాంటికో` సిరీస్‌తో ప్రియాంక చోప్రాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌చ్చిన గుర్తింపు అసాధార‌ణం. వ‌ర‌ల్డ్‌వైడ్ అభిమానులు క‌లిగి ఉన్న మేటి భార‌తీయ తార‌గా వెలిగిపోతోంది. ఆ క్ర‌మంలోనే ప్రియాంక చోప్రా ప‌లు హాలీవుడ్ ఆఫ‌ర్లు అందుకుంటోంది. ఓవైపు బాలీవుడ్ సినిమా, మ‌రోవైపు హాలీవుడ్ సినిమా రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ని సాగిస్తోంది. అయితే మాజీ ప్ర‌పంచ సుంద‌రిగా సామాజిక బాధ్య‌త క‌లిగిన తార‌గారూ మ‌రో కోణంలో త‌న పాపులారిటీ విస్త‌రిస్తోంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌హిళ‌ల ఆరోగ్యంపై నిన‌దించే బ్రాండ్ అంబాసిడ‌ర్‌గానూ కొన‌సాగుతోంది. త్వ‌ర‌లో ఇండియా ఆతిధ్యం ఇస్తున్న హెల్త్ పార్ట‌న‌ర్స్ ఫోర‌మ్‌లో పీసీ మ‌హిళల ఆరోగ్యంపై చ‌ర్చించ‌నుంది. ఈ స‌మావేశానికి ఏకంగా 92 దేశాల నుంచి ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌హిళ‌లు, పిల్ల‌ల ఆరోగ్యం, వైద్య‌ రంగంలో మారుతున్న ట్రెండ్స్‌, తాజా స‌న్నివేశం గురించి మాట్లాడ‌నున్నారు. 2030 నాటికి ఆరోగ్యంలో మ‌న దేశ ప్ర‌జ‌ల స్థాయి ఎలా ఉండాలి? అన్న విష‌యాన్ని పీసీ ప్ర‌స్థావిస్తారు. ఇటీవ‌లే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌మ‌క్షంలో ప్రియాంక చోప్రా ఈ విష‌యంపై సుదీర్ఘంగా మంత‌నాలు సాగించింది. ప్ర‌ధాని మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.న‌డ్డా, చిలీ మాజీ అధ్య‌క్షులు మిసెస్ మిచెల్లి బాష్లెట్ త‌దిత‌రులతో పీసీ ఈ స‌మావేశంలో పాల్గొని ముచ్చ‌టించారు. జ‌ర‌గ‌బోవు కీల‌క కాన్ఫ‌రెన్స్‌లో మ‌న దేశ ప‌రిస్థితుల‌పై ఏం మాట్లాడాలి? అన్న‌ది ముందే ప్రిపేర‌య్యామ‌ని పీసీ వెల్ల‌డించారు.

  •  
  •  
  •  
  •  

Comments