ఉంగ‌రం దాచావు స‌రే.. పెళ్లిని దాచేస్తావా?

Monday, July 30th, 2018, 02:23:12 PM IST

పెళ్ల‌వుతోంది అంటే సంబ‌రంగా చెప్పుకుంటుంది వ‌ధువు. స్నేహితురాళ్ల‌కు ఫోన్ చేసి కాబోయే హబ్బీ ఖ‌రీదైన వ‌జ్రవైఢూర్య అంగుళీకాన్ని వేలికి తొడిగాడ‌ని ముచ్చ‌ట‌ప‌డుతూ తెగ చెప్పుకుంటుంది. కానీ ఇక్క‌డ స‌న్నివేశ‌మే వేరు. వేలికి ఉంగ‌రం తొడిగాడు కాబోయే మ‌గ‌డు! అని చెప్పుకునేందుకే ఎందుక‌నో త‌ట‌ప‌టాయిస్తోంది పీసీ. అస‌లు ఇలాంటి స‌న్నివేశం వేరొక‌రికి రాకూడ‌దు దేవుడా!!

గ‌త కొంత‌కాలంగా విదేశీ ప్రియుడు నిక్ జోనాస్‌తో చెట్టాప‌ట్టాల్ అంటూ తిరిగేస్తున్న ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో క్రేజీ అవ‌కాశాన్ని కూడా కాల‌ద‌న్నుకుంది. స‌ల్మాన్ `భ‌ర‌త్` చిత్రం నుంచి వాకౌట్ చేసింది. ఇక అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్‌లో పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని ఒక‌టే పుకార్ షికారు చేస్తోంది. అదంతా అటుంచితే అస‌లు పీసీ నిక్ జోనాస్‌తో ముంబై విమానాశ్ర‌యంలో దిగిన‌ప్పుడు మీడియా కంట ప‌డ‌కుండా ఎందుక‌ని నిశ్చితార్థ‌పు ఉంగ‌రం దాచేసింది? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తొలుత ఖ‌రీదైన వ‌జ్ర‌పు ఉంగ‌రం నాలుగో వేలికి క‌నిపించింది. అటుపై చ‌టుక్కున మాయ‌మైంది. ఆ ఫోటోల్ని బ‌య‌ట‌పెట్టి బాలీవుడ్ మీడియా నానా హ‌డావుడి చేస్తోంది. పీసీ ప‌రువు తీసి పందిరేసుందుకు రెడీ అయ్యింది. ఇవిగో ఆ ఫోటోలు అంత‌ర్జాలంలోనూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయ్‌. పీసీ ఇలానే పెళ్లిని కూడా దాచేస్తావా? ఎందుకిలా..? అంటూ ప్ర‌శ్నిస్తున్నారంతా.

  •  
  •  
  •  
  •  

Comments