ప్రియాంక ఎంత కొత్తగా ఉందొ

Wednesday, January 31st, 2018, 05:03:05 PM IST

బాలీవుడ్ సినిమాలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో తన సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. అందరిలా కాకుండా ఈ బ్యూటీ కొత్త తరహాలో క్రేజ్ అందుకుంటోంది. టీవీ సిరీస్ ద్వారా ప్రియాంక చాలా ఫెమస్ అవుతోంది. దీంతో హాలీవుడ్ తెరపై అమ్మడు మంచి అవకాశాలను కూడా అందుకుంటోంది. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రియాంక మ్యాగజైన్ లకు ఇచ్చే ఫొటోలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసమని ఇచ్చిన ఫొటో షూట్ కి సంబందించిన ఫొటో కూడా నెటిజన్స్ ని చాలా ఆకట్టుకుంటోంది. మూడు విభిన్న కలర్స్ లో ఉన్న ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చాలా కొత్తగా అనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంకా హాలీవుడ్ లో రెండు సినిమాలను చేస్తోంది. అలాగే ఒక టీవీ సిరీస్ లో కూడా నటిస్తోంది.