పిక్ టాక్: కుక్క పిల్ల‌నైన కాక‌పోతిని!

Saturday, October 20th, 2018, 01:38:49 AM IST

ప్రియాంక చోప్రా అలియాస్ పీసీ త్వ‌ర‌లోనే నిక్ జోనాస్‌ని పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. జోధ్‌పూర్‌లో వెన్యూని బుక్ చేసి వివాహానికి ఏర్పాట్లు మొద‌లు పెట్టేశార‌న్న ప్ర‌చారం సాగుతోంది. న‌వంబ‌ర్‌లోనే పెళ్లి వేడుక అన్న స‌మాచారం ఇటీవ‌లే లీకైంది. ఈ వార్త‌ల న‌డుమ ప్రియుడు నిక్‌తో క‌లిసి పీసీ షికార్ల‌లో మునిగి తేలుతోంది. దేశ‌, విదేశాల్ని చుట్టి వ‌స్తోంది. ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో నిక్ ఫ్యామిలీతోనే టైమ్ స్పెండ్ చేస్తోంది.

ఇదిగో ఇలా ఎన్‌వైసీ వీధుల్లో ప‌ప్పీతో క‌లిసి షికారుకి వెళ్లింది. ఆ క్యూట్ ప‌ప్పీతో క‌లిసి అలా బ్రిట‌న్ మ‌హారాణిలా పీసీ ఇచ్చిన ఫోజు యూత్‌ని తెగ క‌వ్విస్తోంది. ఇంత‌కీ ఈ అరుదైన కానుక‌ను ఇచ్చింది ఎవ‌రు? హ‌బ్బీ నిక్ పీసీకి ఈ గిఫ్ట్ ఇచ్చాడా? అంటూ ఒక‌టే సందేహం క‌లుగుతోంది. నిక్‌ని పెళ్లాడే ప‌నిలో ఉంది కాబ‌ట్టి బాలీవుడ్‌లో ప‌లు క్రేజీ ప్రాజెక్టుల్ని వ‌దులుకుంది ఈ అమ్మ‌డు. హాలీవుడ్ మూవీ `ఏ కిడ్ లైక్ జేక్` చిత్రం త‌ప్ప ఇప్ప‌టివ‌ర‌కూ వేరొక ప్రాజెక్టు గురించి ఏ ముచ్చ‌టా లేదు. స‌ల్మ‌న్ – అలీ అబ్బాస్ జాఫ‌ర్ కాంబినేష‌న్ మూవీ `భ‌ర‌త్‌` నుంచి త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే.