అరవింద కోసం బాలీవుడ్ భామ స్టెప్పులు ?

Friday, September 28th, 2018, 10:06:07 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాకు సంబందించిన మరో క్రేజీ న్యూస్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటో తెలుసా .. ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటెం సాంగ్ ఉందట .. దానికోసం బాలీవుడ్ భామను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా .. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా !! ఏంటి ప్రియాంకా చోప్రా సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందా ? ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలకు సమయం కేటాయించని ఈ భామ తెలుగు సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ చేస్తుందా ? అంటూ షాక్ అవుతున్నారా ? నిజమే ఈ సినిమాకోసం ప్రియాంకా చోప్రా ను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో తెలుగు హీరోయిన్స్ తో ఐటెమ్ సాంగ్ చేయిస్తే రొటీన్ అవుతుందని భావించిన మేకర్స్ ప్రియాంకా కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో చేయడానికి ప్రియాంక ఓకే చెబుతుందా ? అసలు ప్రియాంకా కు ఈ సినిమా చేసే టైం ఉందా ? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం ఏమి జరుగుతుందో.