పెళ్లి గురుంచి స్పందించిన ప్రియాంకా ?

Tuesday, May 1st, 2018, 01:10:38 PM IST

బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోను క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ ప్రియాంకా చోప్రా రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె విమానంలో ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఆ ఫోటో పెద్ద దుమారమే రేపుతోంది. దానికి కారణం ఆమె చేతికి కొత్తగా ఎదో బ్రాస్లెట్ ఉండడంమే కారణం. దాంతో ప్రియాంక వ్యవహారం పై పెద్ద రచ్చ జరుగుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక వెంటనే రెస్పాండ్ అయ్యింది. ఈ ఫోటోను చూసి అందరు నేను రహస్యంగా వివాహం చేసుకున్నానని ప్రచారం చేస్తున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు .. దిష్టి తగలకుండా ఆ బ్రాస్లెట్ వేసుకున్నానని, ఒకవేళ పెళ్లి చేసుకుంటే తప్పకుండా అందరికి చెప్పే చేసుకుంటానని క్లారిటీ ఇచ్చేసింది. అది విషయం !!