వాట్ .. ప్రియాంకా పెళ్లి ఫిక్సయిందా ?

Wednesday, August 1st, 2018, 01:52:06 AM IST

అంటే అవుననే అంటున్నాయి అమెరికా వర్గాలు ? అదేంటి బాలీవుడ్ వర్గాల్లో ఈ న్యూస్ రావాలి కానీ అమెరికాలో ఏమిటి ? అని షాక్ అవుతున్నారా . .. మీరు విన్నది నిజమే ఇప్పుడు ప్రియాంకా చోప్రా అంటే కేవలం ఇండియన్ స్టార్ కాదు .. షీ ఈజ్ ఇంటర్నేషనల్ స్టార్. ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఈ మధ్య ప్రేమలో పడిందని .. ప్రియుడితో షికార్లు కూడా కొడుతుందంటూ ప్రచారం జరుగుతున్నా విషయం తెలిసిందే. తాజాగా తనకంటే చిన్నవాడైన తన ప్రియుడు నిక్ జోనస్ తో ప్రియాంకా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందట. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ప్రియాంకా చోప్రా ఉంగరం వెలికి ఉంగరం తొడగడం .. తన ప్రియుడితో కలిసి చెట్టపట్టాలు వేసుకుని తిరగడం చూస్తుంటే .. వీరు బహిరంగానే తమ ప్రేమ విషయాన్నీ చెప్పేసినట్టు ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. అయితే ప్రియాంకా కూడా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో .. ఈ సెప్టెంబర్ 16న వీరి పెళ్లి అమెరికాలో జరగనుందంటూ అక్కడి మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఆ రోజే ఎందుకంటే తన ప్రియుడు నిక్ పుట్టినరోజు కావడంతో ఆ రోజే ఫిక్స్ చేశారట. మరి ఈ విషయం నిజమా కదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments