వేరొక వ్యక్తితో కలిసి స్నానం చేశాను అంటున్న ప్రియాంక చోప్రా….!

Monday, January 23rd, 2017, 04:49:23 PM IST

priyanka
ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తన ప్రతిభతో బాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోయిన్ గా అందలం ఎక్కింది. అంతేకాదు అక్కడి నుండి హాలీవుడ్ కు కూడా వెళ్ళిపోయింది. ముందుగా అమెరికాలోని క్వాంటికో షో తో హాలీవుడ్ రియాలిటీ షోలతో బిజీబిజీ గా ఉంది ప్రియాంక. ఇటీవల ఆమె కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో కరణ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె ఆశ్చర్యపోయే సమాధానాలు ఇచ్చింది.

కరణ్ ప్రియాంకను ‘నువ్వు కొంతమందితో ఫోన్ రొమాన్స్ చేస్తున్నావట కదా అని అడిగాడు. దానికి ప్రియాంక చోప్రా ఏం తడుముకోకుండా సమాధానం ఇచ్చింది. ‘అవును నేను ఫోన్ రొమాన్స్ చేసాను. ఒక కార్యక్రమంలో ర్యాపిడ్ రౌండ్ లో భాగంగా ఫోన్ రొమాన్స్ లో పాల్గొన్నాను. అంతేకాదు వేరొక వ్యక్తితో కలిసి స్నానం కూడా చేసాను. ఇంకా విడిపోయిన తర్వాత కూడా నా బాయ్ ఫ్రెండ్ ని ముద్దు పెట్టుకున్నాను అని చెప్పింది. గుండే సినిమా సమయంలోనే తనకి హాలీవుడ్ టీవీ షోల అవకాశాలు వచ్చాయని, 25 స్క్రిప్టులను పరిశీలించిన తరువాత క్వాంటికో కు ఓటేశానని ప్రియాంక చోప్రా చెప్పింది.