ప్రియాంక చోప్రా స్టన్నింగ్ లుక్ !

Monday, January 22nd, 2018, 06:30:03 PM IST

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా గత కొంత కాలంగా బాలీవుడ్ లో కంటే హాలీవుడ్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా అమ్మడు ఇస్తున్న ఫొటో షూట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా డబ్బూ రత్నాని ఫొటో షూట్ లో దర్శనం ఇచ్చిన ప్రియాంక స్టన్నింగ్ లుక్ తో షాక్ ఇచ్చింది. ఇంతకుముందు చాలా వరకు ఇలాంటి స్టిల్స్ తో కనిపించినప్పటికీ మరి ఇంత అందంగా ప్రియాంక కనిపించలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు బికినీ రేంజ్ లో ఫొటోలకి స్టీల్ ఇచ్చిన ప్రియాంకా ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఇక ప్రస్తుతం అమ్మడు హాలీవుడ్ సీరియల్స్ తో కొంచెం బిజీగా ఉంది. అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.