కొత్త వ్యాపారంలోకి లోకి బాలీవుడ్ క్రేజీ భామ ?

Thursday, October 4th, 2018, 08:18:09 PM IST

బాలీవుడ్ క్రేజీ గర్ల్ .. ప్రియాంకా చోప్రా త్వరలోనే వివాహం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నిక్ తో డేటింగ్ చేస్తున్న ఈ అమ్మడు ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనే ప్రయత్నాల్లో ఉంది. దాంతో పాటు అటు బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రియాంకా చోప్రా ఓ కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అయింది. ఆ బిజినెస్ ఏమిటో తెలుసా .. డేటింగ్ యాప్ ద్వారా ఆమె వ్యాపారం చేస్తుందట. బంబుల్ అనే డేటింగ్ యాప్ ద్వారా ఈ బిజినెస్ జరగనుందని, దీనికి సంబంధించి అమెరికా కోడింగ్ స్కూల్ అనే సంస్థ లో పెట్టుబడి పెట్టింది. లింగ వివక్ష లేకుండా మెరుగైన సమాజం కోసం ఈ వ్యాపారంలోకి దిగానని చెప్పింది. ఇది నా కల .. ఈ యాప్ ద్వారా మహిళలకే మొదటి ఛాన్స్ ఉంటుందని చెప్పింది. మొత్తానికి ప్రియాంకా యాప్ బిజినెస్ ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది.