ఈవెంట్లు చేస్తే ఇన్వెస్టర్లు రారు మోదీగారు

Wednesday, September 18th, 2019, 03:00:55 PM IST

మోదీ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుందని, ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ అమెరికాలో ఈ నెల 22న హౌదీ మోదీ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. దీనికి 50,000 మంది హాజరవుతారని అంచనా.

దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇలా విదేశాల్లో ఈవెంట్లు చేస్తే ఇన్వెస్టర్లు రారని చురకలు వేశారు. మీడియాలో దేశం అభివృద్ది చెందుతుందని తప్పుడు చేస్తూ ప్రజల్ని మభ్య పెట్టడం ఆర్థిక వ్యవస్థను బాగుచేయదని, ప్రభుత్వం వాస్తవాన్ని గుర్తించి పనిచేయాలని హితబోధ చేశారు.

ప్రభుత్వ విధానాల వలన అభివృద్ది కుంటుపడిందని అంటూ అక్టొబర్ 15 నుండి 25 వరకు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.