వీడియో : ప్రియాంక కొత్త హాలీవుడ్ సినిమా ట్రైలర్ చూశారా..?

Saturday, April 14th, 2018, 10:47:22 AM IST

ప్రముఖ కథానాయిక ప్రియాంకా చోప్రా నటించిన రెండో హాలీవుడ్‌ సినిమా ‘ఎ కిడ్‌ లైక్‌ జాక్‌’. హాలీవుడ్‌ నటులు జిమ్‌ పార్సన్స్‌, క్లైరే డేన్స్‌ ప్రధాన తారాగణంగా కనిపించనున్నారు. వీరి స్నేహితురాలు అమల్‌ పాత్రలో ప్రియాంక అలరించనున్నారు. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో ఆమె కేవలం మూడు సెకన్లు మాత్రమే కనిపించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఆమె పాత్ర మాత్రం కథలో కీలకమని సమాచారం.

సిలాస్‌ హోవార్డ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని జనవరిలో సన్‌డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. నాలుగేళ్ల చిన్నారి జాక్‌ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. చిన్నారి ఆలోచనలు, స్వభావం ఆమె తల్లిదండ్రులకు సవాలుగా మారుతుంది. ప్రియాంక అమెరికన్‌ టీవీ సిరస్‌ ‘క్వాంటికో’తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్‌ మూడో సీజన్‌ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్‌కు గానూ ఆమె రెండు పీపుల్‌ ఛాయిస్‌ అవార్డులు గెలుచుకున్నారు. 2017లో ‘బేవాచ్‌’ చిత్రంతో ప్రియాంక నటిగా హాలీవుడ్‌కు పరిచయం అయ్యారు.

  •  
  •  
  •  
  •  

Comments