ఆ విషయంలో ప్రియాంకా అంతగా హర్ట్ అయిందా ?

Sunday, October 22nd, 2017, 11:02:44 AM IST

గ్లామర్ భామ ప్రియాంక చోప్రా అంటే ఎలాంటి క్రేజ్ ఉందొ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో దుమ్ము రేపిన ఈ అమ్మడు అటు హాలీవుడ్ లోకూడా సత్తా చాటుతుంది. ఇప్పటికే హాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న ప్రియాంక చోప్రా తాజాగా ఓ సంఘటనపై ఘాటుగానే స్పందించింది. అదేమిటంటే తాజాగా హాలీవుడ్ నిర్మాత హార్వే వైంస్టింగ్ లైంగిక వేధింపుల పై ఆమె స్పందిస్తూ .. అలాంటి వ్యక్తులు ఒక్క హాలీవుడ్ లోనే కాదు అంతటా ఉన్నారంటూ స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రియాంకా ఈ విషయం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అలా చెప్పింది. ఇండియా లో అలాంటి వ్యక్తులు ఉన్నారా అన్న ప్రశ్నకు సమాధానంగా అలాంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారని నను అనుకోవడం లేదని కూడా చెప్పింది? పహిళలపై పురుషుల ఆధిపత్యం ఇలాగె ఉంటుందని ప్రియాంక చెప్పింది. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా బయటకు వస్తాయని కూడా చెప్పడం షాక్ ఇస్తుంది. మొత్తానికి ప్రియాంక మాటల్లో ఇలాంటి వేధింపులు సెక్స్ సమస్య కాదని, ఇది అధికారానికి సంబందించినది అని తెలిపింది.

  •  
  •  
  •  
  •  

Comments