స్పైడర్ ప్రీమియర్ షో లకు టెక్నికల్ ప్రాబ్లమ్స్..!!

Wednesday, September 27th, 2017, 01:07:50 AM IST

స్పైడర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో విడుదలకుసిద్దం అవుతున్న నేపథ్యంలో యూఎస్ లో ప్రీమియర్ షోలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం యూఎస్ లో 12:30 గంటలకు మొదలు కలవాల్సిన షోలు ఇంకా ప్రారంభం కాలేదు. డిస్ట్రిబ్యూటర్ లకు ‘కీ’ల సమస్య ఏర్పడిందా లేదా వేరే ఏదైనా సాంకేతిక కారణమా అనేది తెలియాల్సి ఉంది.

ఈ విషయంపై చిత్ర యూనిట్ డిస్ట్రిబ్యూటర్ లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మరో గంటలో యూఎస్ లోని అన్ని ఏరియాలలో షోలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్పైడర్ చిత్రానికి ఉన్న డిమాండ్ తో మహేష్ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ స్థాయిలో యూఎస్ వ్యాప్తంగా విడుదలవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments