దర్శకుడు వంశీ పైడిపల్లి పై నిర్మాత పిర్యాదు?

Friday, December 30th, 2016, 11:07:03 AM IST

vamsi-paidipally
దర్శకుడు వంశీ పైడిపల్లి పై నిర్మాతల మండలిలో కేసు నమోదైంది. ఈ దర్శకుడిపై కేసు పెట్టింది ఎవరో కాదు ప్రముఖ నిర్మాత పివిపి ? ఇదివరకే వీరిద్దరి కలయికలో ‘ఊపిరి’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉన్నట్టుండి వంశీ పై పివిపి ఎందుకు కేసు పెట్టాడో తెలుసా … నాగార్జున , కార్తీ లతో ‘ఊపిరి’ సినిమా తీసిన వంశీ పైడిపల్లి ఆ తరువాత మహేష్ తో తన నెక్స్ట్ సినిమాను పివిపి బ్యానర్ లోనే చేస్తానని కమిట్ అయ్యాడు. దాంతో ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగాయి. మహేష్ కూడా వంశీ తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ దిల్ రాజు చేతిలోకి వెళ్ళింది. మహేష్ – వంశీ ల కాంబినేషన్లో రూపొందే సినిమాను దిల్ రాజుతో పాటు సీనియర్ నిర్మాత అశ్వినీదత్ తో కలిసి నిర్మిస్తున్నట్టు దిల్ రాజు ప్రకటించాడు ? దాంతో ఈ విషయం పై క్లారిటీ ఇవ్వాలని వంశీ ని అడిగిన సమాధానం రాకపోవడంతో పివిపి నిర్మాతలా మండలిలో కేసు వేసాడు. వంశీ తో తానూ నిర్మించిన ఊపిరి సినిమా నష్టం తనకు చెల్లించాలని అయన పిర్యాదు చేసాడు. మరి ఈ విషయం పై వంశీ ఎలా స్పందిస్తాడో చూడాలి?

  •  
  •  
  •  
  •  

Comments