ఈ మధ్య వస్తున్న సినిమాలు దిల్ రాజుకి నచ్చట్లేదనుకుంటా.!

Monday, October 1st, 2018, 05:55:19 PM IST

ఈ మధ్య కాలంలో వస్తున్న చిత్రాల్లో కాస్త శృతి మించుతున్నాయనే చెప్పాలి,ఇది వరకు అరకొరగా అప్పుడప్పుడు ఎవరో స్టార్ హెర్ల సినిమాల్లో సందర్భానుసారం పెదవి ముద్దులు ఉండేవి.కానీ గడిచిన ఈ కొన్నేళ్లలోనే చాలా మార్పులు వచ్చేసాయి.కథతో సంబంధం లేకుండా హీరోయిన్ల అందాల ఆరబోతలు,ఘాటైన పెదవి ముద్దుల సీన్లు ఎక్కువయ్యిపోయాయి అనే చెప్పాలి.కొంచెం చిన్న సినిమాల్లో ఐతే ఇంకా ఎక్కువగా కూడా వస్తున్నాయి.ఇప్పుడున్న కాలంలో జనం మంచి చెడు అనే విషయాలను మర్చిపోయారని దిల్ రాజు ఒక ఆడియో ఫంక్షన్లో కాస్త అసంతృప్తికి లోనయ్యారు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న హుషారు అనే చిత్రానికి ముఖ్య అతిధిగా దిల్ రాజు విచ్చేసారు ఆ చిత్రంపై సంబందించిన పోస్టర్లను చూసి ఈ రోజుల్లో ప్రేక్షకులు మంచి చెడులు మర్చిపోయి కేవలం వినోదానికే పెద్ద పీట వేస్తున్నారని,తానేమో తన సినిమాల ద్వారా మంచి సందేశం ఇద్దామని చూస్తుంటే వీళ్ళేమో తన చేత చెడు సినిమాకి లాంచ్ చేస్తున్నారని,తెలిపారు.ప్రేక్షకులు కూడా కేవలం వినోదం,లిప్ లాక్ సీన్లు ఉన్న చిత్రాల వైపుకే మొగ్గు చూపుతున్నారని భవిష్యత్తులో తాను కూడా అదే తరహాలో సినిమాలు తీస్తానేమో అని కాస్త అసహనంగానే మాట్లాడారు.