స్టార్ హీరో, డైరెక్ట‌ర్‌తో గొడ‌వ‌ప‌డుతున్న నిర్మాత‌?

Saturday, December 31st, 2016, 04:45:02 PM IST

pvp
బ‌ళ్లు ఓడ‌ల‌వుతాయి.. ఓడ‌లు బ‌ళ్ల‌వుతాయి. సినిమా ఇండ‌స్ట్రీలో ఇవ‌న్నీ మామూలే. మామా.. బావా అంటూ భుజంపై చెయ్యేసి ప‌రాచికం ఆడేవాళ్లే ఒక్కోసారి అనుకోని విరోధి అయిపోతుంటారు. మ‌నీమ్యాట‌ర్స్‌, డీల్స్ స‌రిగా సెట్ట‌వ్వ‌క‌పోతే ఇలాంటి గొడ‌వ‌లే అవుతుంటాయి. ఇప్పుడు అదే టైపు గొడ‌వ ఒక‌టి టాలీవుడ్‌లో రాజుకుపోతోంది. ఓ స్టాప్రొడ్యూస‌ర్ ఏకంగా స్టార్ డైరెక్ట‌ర్‌పైనే హైకోర్టులో కేసు వేసేంత‌గా.. ఫిలింఛాంబ‌ర్‌లో ఫిర్యాదు చేసేంత‌గా.. వెళ్లిపోయింది. అస‌లింత‌కీ ఈ టోట‌ల్ ఎపిసోడ్‌లో స్టార్ హీరో ఎవ‌రు? స‌్టార్ డైరెక్ట‌ర్ఎవ‌రు? స‌్టార్ ప్రొడ్యూస‌ర్ ఎవ‌రు? అంటే .. మ‌హేష్‌- వంశీ పైడిప‌ల్లి-పీవీపీ గురించే ఇదంతా. ఈ ఎపిసోడ్‌లో ఆ ముగ్గురి మ‌ధ్యా ఏదో జ‌రుగుతోంది.

వాస్త‌వానికి బ్ర‌హ్మోత్స‌వం ప‌రాజ‌యం ఇదంతా చేస్తోంద‌ని చెబుతున్నా.. లోలోన ఇంకేదో ఉంద‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పీవీపీకి ఓ అల‌వాటుంది. త‌న హీరో, డైరెక్ట‌ర్ల‌తో రెండు ప్రాజెక్టుల డీల్ త‌ప్ప‌నిస‌రి. అదే కోవ‌లో మ‌హేష్‌తో రెండు సినిమాల డీల్‌, వంశీతో రెండు సినిమాల డీల్ కుదుర్చుకున్నారు. మ‌హేష్‌తో బ్ర‌హ్మోత్స‌వం, వంశీతో ఊపిరి తీశాడు. వీటిలో మ‌హేష్ సినిమా ఫ‌ట్‌. వంశీ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్‌. కానీ బ్ర‌హ్మోత్స‌వం వ‌ల్ల 20 కోట్ల వ‌ర‌కూ న‌ష్టం వ‌చ్చింద‌న్న‌ది ఇన్‌సైడ్ ట్రేడ్ టాక్‌. దాంతో మ‌హేష్‌తో త‌దుప‌రి చేయాల్సిన సినిమాకి వంశీ క‌థ చెప్పేశాడు. సినిమా ఉంద‌ని ప్ర‌క‌టించేశారు. కానీ ఎక్క‌డ చెడిందో ఈ సినిమా వేరొక నిర్మాత‌తో చేయాల‌ని మ‌హేష్ ఫిక్స‌య్యారు. వంశీ పైడిప‌ల్లి సైతం మ‌హేష్‌తో త‌న సినిమా దిల్‌రాజు-అశ్వ‌నిద‌త్ క‌ల‌యిక‌లో ఉంటుంద‌ని ప్ర‌క‌టించేశాడు. దీంతో షాకైన పీవీపీ వంశీ పైడిప‌ల్లిపై ఎటాక్ మొద‌లెట్టారు. ముందుగా మ‌ద్రాసు హైకోర్టులో కేసు వేశారు. దానికి ఇంజెక్ష‌న్ వ‌చ్చింది. అలాగే వంశీపైడిప‌ల్లిపై చాంబ‌ర్‌లోనూ పీవీపీ ఫిర్యాదు చేశారు. అక్క‌డా ద‌ర్యాప్తు సాగుతోంది. ఏదైతేనేం ప్రాజెక్టు మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అయితే పైడిప‌ల్లి మాత్రం ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయాడు. మ‌రి ఈ క‌థ ఏ కంచికి చేరుతోందో? అంటూ ప‌రిశ్ర‌మ‌లో ఒక‌టే మ‌ద‌నం. దీనిపైనే ఫిలింన‌గ‌ర్‌లో తెగ చ‌ర్చ సాగుతోంది. అన్నిటికీ దేవుడే దిక్కు. లెట‌జ్ వెయిట్ అండ్ సీ.

  •  
  •  
  •  
  •  

Comments