రామ్ సినిమాకు నిర్మాత కరువు ?

Monday, March 26th, 2018, 09:59:47 AM IST

ఎనర్జటిక్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న హీరో రామ్ ఇప్పటి వరకు ఫక్తు కమర్షియల్ సినిమాలే చేసాడు. ఆ తరువాత వరుస పరాజయాలతో సతమతమైన ఆయనకు నేను శైలజ మంచి క్రేజ్ తెచ్చి ఫ్యామిలీ ప్రేక్షకుల్లో అభిమానులను చేసింది. ఆ తరువాత చేసిన ఉన్నది ఒక్కటే జీవితం సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం అందలేదు. ప్రస్తుతం త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న రామ్, తాజాగా గరుడ వేగా లాంటి సినిమా చేసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తో ఓ సినిమాకు రామ్ ఓకే చెప్పాడు. ఇప్పటికే కథ చర్చలు కూడా జరుపుకున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నట్టు వార్తలు వచ్చాయి . కానీ సడన్ గా ఎందుకో ఆ నిర్మాత ఈ సినిమా చేయడం లేదని తెలుస్తోంది. దాంతో రామ్ ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారో అన్న సందేహాలు ఎక్కువయ్యాయి. ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కువ అవ్వడంతోనే అయన తప్పుకున్నట్టు తెలుస్తోంది.