కత్తి మహేష్ పై నిర్మాత రాంకీ సంచలన ఆరోపణలు !

Thursday, January 18th, 2018, 09:27:21 AM IST

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కు పవన్ ఫాన్స్ కు జరుగుతున్న వివాదం నేడు రాష్ట్రంలో ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. దీనిలో భాగంగా నిన్న తెలుగు సినీ నిర్మాత రాంకీ కత్తి మహేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కత్తి మహేష్ ఒక స్త్రీ లోలుడని, ఒక చీడపురుగు, అమ్మాయిలకు అసభ్యకర మెసేజిలు చేస్తుంటాడని, నిజానికి కత్తిని తనకు మోహన్ రావిపాటి అనే నిర్మాత పరిచయం చేసారని ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో మాట్లాడుతూ చెప్పారు. సందర్భాన్ని బట్టి తెలివిగా మాట్లాడడం ఆయనకి బాగా తెలుసునని అన్నారు. డైరెక్షన్ గురించి అసలు కత్తి మహేష్ కి ఏమి తెలియదని కేవలం మాటలు మాత్రమే బాగా చెప్తాడని, చేతలు ఏమి ఉండవని విమర్శించారు. ఆయనకు సంబందించిన మరికొన్ని సంచలన విషయాలు రేపు ఇదే ఛానల్ ద్వారా బయటపెడతానని, అప్పటివరకు పవన్ కళ్యాణ్ అభిమానులు సంయమనం తో వుండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాంకీ ఆరోపణల పై కత్తి మహేష్ ఏవిధంగా స్పందిస్తారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.