కారుకోసం రూ.7లక్షలు ఇచ్చేసిన హీరో!

Thursday, March 8th, 2018, 05:46:54 PM IST

ఈ రోజుల్లో సినీ తారలు వారి జీవితాన్ని చాలా స్టైలిష్ గా సెట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా వాహనాల విషయంలో వారు పెట్టె ఖర్చు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మెయిన్ గా ఫ్యాన్సీ నెంబర్స్ విషయంలో వారు ఏ మాత్రం తగ్గడం లేదు. పోటీ పడి మరి వేలంలో దక్కించుకుంటున్నారు. రీసెంట్ గా మలయాళం నటుడు పృథ్వీరాజ్‌ కూడా ఫ్యాన్సీ నెంబర్ ను గట్టి ధరకే దక్కించుకున్నాడు. గత ఏడాది రూ.3.25 కోట్ల ఖరీదైన లంబోర్గిని హరికేన్‌ కారును కొనుగోలు చేశాడు. ఈ కంపెనీ కార్లకు 7 స్పీడ్‌ ట్విన్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ గేర్‌ బాక్సులు మేజర్ ప్లస్. మూడు కోట్ల విలువైన lp580-2 మోడల్‌ కి 5.2 లీటర్‌ వీ10 ఇంజిన్‌ ఉండడం స్పెషల్. అయితే ఇంత అత్యాధునికత కలిగిన కారు కోసం ఈ నటుడు ఒక ఫ్యాన్సీ నెంబర్ ను సెట్ చేయాలనీ అనుకుంటున్నాడు. అయితే రీసెంట్ గా ఎర్నాకులం ఆర్టీవో కార్యాలయం వారు ఫ్యాన్సీ నెంబర్ kl07cn అనే నంబర్‌ ప్లేట్‌ను వేలానికి పెట్టారు.విషయం తెలుసుకున్న పృథ్వీరాజ్‌ వెంటనే వేలంలో ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకోవడానికి 7 లక్షలు పెట్టేశాడు. పది వేల రూపాయలతో ప్రారంభమైన వేలం పాట హీరోగారి డామినేషన్ కి 7 లక్షలకు ఎండ్ అయ్యింది.