పవన్ సినిమా షూటింగ్ పూర్తయ్యేది అప్పుడే..దీపావళికి మెరుపు..!!

Friday, September 29th, 2017, 10:32:26 AM IST


హారిక హాసిని నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చిత్రం ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి త్రివిక్రమ్ ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారో అని పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దసరా సందర్భగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ అక్టోబర్ మొదటి వారంలో మరో షెడ్యూల్ ని ప్రారంభిస్తారు. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే చిత్ర యూనిట్ విదేశాలలో షూటింగ్ కు వెళ్లనుంది. ఈ షెడ్యూల్ తో చిత్ర షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

దసరా సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ అది జరగడం లేదు. దీపావళికి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు వినికిడి. అంటే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో మెరవబోయేది దీపావళికే అన్న మాట.

  •  
  •  
  •  
  •  

Comments