స‌బ్జెక్టులో ఎవ‌రు ది బెస్ట్‌.. ? ప‌వ‌న్ `స‌బ్జెక్టు`లో మ్యాట‌రెంత‌!?

Monday, November 14th, 2016, 03:11:28 PM IST

babu-jagan-pawan
ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌జ‌ల్లో ఓ ముఖ్య‌మైన చ‌ర్చ సాగుతోంది. ఇప్పుడున్న నాయ‌కుల్లో ఎవ‌రు ది బెస్ట్ టాకేటివ్ ? ఎవ‌రి ద‌గ్గ‌ర స‌బ్జెక్టు ప‌ర‌మైన మ్యాట‌ర్ ఉంది? అన్న‌ది ముచ్చ‌టించుకుంటున్నారు. ఇప్పుడున్న స‌న్నివేశంలో ఏపీలో ముక్కోణ‌పు పోటీ నెల‌కొంది. అధికార తేదేపాతో పాటు ప్ర‌తిప‌క్ష వైకాపా, అలాగే జ‌న‌సేన బ‌రిలో ఉన్నాయి. ప‌వ‌న్ రాక‌తో జ‌గ‌న్ ప‌రిస్థితి అంతా రివ‌ర్స‌యిపోయింది. జ‌గ‌న్ కంటే ప‌వ‌న్ బెట‌ర‌న్న టాక్ జ‌నాల్లో న‌డుస్తోంది. అయితే ప‌వ‌న్‌కి ఈ స్థాయి రావ‌డానికి కార‌ణం లేక‌పోలేదు.

జ‌నాలు ఉన్న‌దున్న‌ట్టు విశ్లేషిస్తున్నారు. ఏ నేత ఏం మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఎవ‌రి మాట‌ల్లో ఎంత వాస్త‌విక‌త ఉంది? అన్న‌ది ప‌రిశీలిస్తున్నారు. చంద్ర‌బాబు రాజ‌కీయ దురంధురుడు కాబ‌ట్టి ఆయ‌న్ని వ‌దిలేస్తే.. ఆ కోణంలో చూస్తే వైయ‌స్ జ‌గ‌న్ కంటే ప‌వ‌న్ స్పీచ్‌ల్లోనే వాడి వేడి, నిర్మాణాత్మ‌క‌మైన ప‌ద‌జాలం ఉన్నాయ‌ని జ‌నం తేల్చేశారు. ప‌వ‌న్ ఏం మాట్లాడినా స్ప‌ష్టంగా మాట్లాడుతున్నాడు. మొన్న‌టి అనంత‌పురం బ‌హిరంగ స‌భ కేవ‌లం త‌న‌కి మూడో స‌భ‌. అయినా ఎంతో స్ప‌ష్టంగా క్లారిటీతో మాట్లాడాడు. పోల‌వ‌రానికి కేవ‌లం 8000 కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకోవాలని చూస్తోందంటూ చుర‌క‌లు వేశాడు. సేమ్ టైమ్ తేదేపా ఎలా మారాలో కూడా సూచించ‌గ‌లిగాడు. వ్య‌క్తుల‌ మీద కాదు యుద్ధం.. విధానాల‌పై నా యుద్ధం అంటూ ప్ర‌క‌టించాడు. ఇక రాయ‌ల‌సీమ క‌రువు, అనంత‌పురం గురించిన విష‌యాలు ప‌క్కా క్లారిటీతో మాట్లాడాడు. ఎంతో అధ్య‌య‌నం చేస్తే కానీ అది సాధ్యం కాదు. ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంలోనూ అత‌డు అడిగిన ప్ర‌శ్న‌లు సూటిగా గుచ్చుకునేలా ఉన్నాయి. ఈ అన్ని అంశాల్లో జ‌గ‌న్‌తో ప‌వ‌న్‌ని పోలుస్తూ శ‌భాష్ జ‌న‌సేనాని అంటున్నారు జ‌నం. ఎంత‌సేపూ చంద్ర‌బాబే టార్గెట్‌గా, తేదేపాని ఆడిపోసుకోవ‌డం త‌ప్ప క్లారిటీ మిస్స‌యిన జ‌గ‌న్ ఇంకేమీ చేయ‌లేక‌పోతున్నాడ‌ని ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నారు. ఇక స్పీచ్‌లో కూడా ప‌వ‌న్‌లో ఉన్న వాడి- వేడి లేనేలేదని అంటున్నారు. ఏ ర‌కంగా చూసినా ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షం అంటే జ‌న‌సేన పార్టీనే అని కోడై కూస్తున్నారంతా. అదీ సంగ‌తి.

  •  
  •  
  •  
  •  

Comments