వైఎస్ఆర్ జిల్లాలో పుల్లరిన్ నిక్షేపాలు

Tuesday, September 23rd, 2014, 11:46:16 AM IST

Pullarin,-Kadappa,-Mangapet
ప్రపంచంలో అత్యంత విలువైన ఖనిజ నిక్షేపం పుల్లరిన్.. ఈ పుల్లరిన్ నిక్షేపాలు కేవలం ఒక్క రష్యాదేశంలోని శృంగైట్ స్టోన్స్ లో మాత్రమే మనకు ఇప్పటివరకు కనిపించింది. కాని, ఇప్పుడు ఆ అత్యంత విలువైన పుల్లరిన్ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో భారీగా బయటపడ్డాయి. కడపజిల్లా మంగంపేటలోని బైరటీస్ గనుల్లో కనుగోన్నట్టు పరిశోధకులు చెప్తున్నారు. దాదాపు 225 హెక్టార్లలో ఈ నిక్షేపాలు ఉన్నట్టు వెల్లడించారు. పుట్ బాల్ ఆకారంలో ఎనిమిది పరమాణువులు ఉండే ఈ పుల్లరిన్ ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. పదిగ్రాముల పుల్లరిన్ ఖనిజం మార్కెట్ లో 30లక్షల రూపాయలు పలుకుతున్నది.
మంగపేటలోని బైరటైస్ గనుల్లో ఈ ఖనిజం ఉన్నట్టు కనుగొన్నప్పటికీ, పూర్తీ స్థాయి నివేదికలు ఇంకా అందకపోవడంతో వెలికితీత కార్యక్రమం ఆలస్యం అవుతున్నది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక, పుల్లరిన్ ఖనిజాన్ని వేలితీసే కార్యక్రమం ఊపందుకున్నది. బైరటైస్ గనుల నుంచి పుల్లరిన్ ఖనిజాన్ని వేలికీస్తే.. కడప జిల్లాకు అంతర్జాతీయంగా మంచి పేరు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.