పుల్లెల గోపిచంద్ బ‌యోపిక్.. గెట్ రెడీ!

Wednesday, September 27th, 2017, 09:56:31 AM IST


బ్యాడ్మింట‌ర్ కోచ్ పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తాన‌ని, అందులో తాను స్వ‌యంగా న‌టిస్తాన‌ని హీరో సుధీర్ బాబు ప్ర‌క‌టించి ఇప్ప‌టికే నాలుగైదేళ్లు అవుతోంది. నాటి నుంచి ఈ సినిమా సెట్స్‌కెళ్ల‌డంపై తామ‌ర‌తంప‌ర‌గా వార్త‌లొస్తున్నాయి. ప్ర‌తిసారీ హీరో సుధీర్ బాబు ఈ విష‌యంపై ప్ర‌స్థావిస్తూనే ఉన్నారు. మీడియా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూనే ఉన్నారు. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ క్ర‌మంలోనే ఎల్‌బిడ‌బ్ల్యూ, చంద‌మామ క‌థ‌లు వంటి హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో గోపిచంద్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నామ‌ని సుధీర్‌బాబు ప్ర‌క‌టించారు.

ఇక సెట్స్‌కెళ్ల‌డ‌మే ఆల‌స్యం అనుకుంటుండ‌గానే.. ప్ర‌వీణ్ స‌త్తారు వేరే క‌మిట్‌మెంట్‌తో బిజీ అయిపోయారు. రాజ‌శేఖ‌ర్ హీరోగా గ‌రుడ‌వేగ చిత్రం ప్రారంభించారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికి పూర్త‌వుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిపోగానే గోపిచంద్ బ‌యోపిక్‌పై దృష్టి సారించేందుకు ప్ర‌వీణ్ స‌త్తారు ఆస‌క్తిగా ఉన్నారుట‌. ఇప్ప‌టికే ఆల‌స్యమైంది. ఇక‌ వీలైనంత త్వ‌ర‌గా సినిమా ప్రారంభించాల‌ని సుధీర్‌, ప్ర‌వీణ్ స‌త్తారు భావిస్తున్నారుట‌. టాలీవుడ్‌లో వ‌రుస‌గా బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. ప్ర‌ముఖ క్రీడాకారుల‌పై సినిమాలు తెర‌కెక్కించేందుకు ఫిలింమేక‌ర్స్ ఆస‌క్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ ఇన్‌స్పిరేష‌న్‌తో మ‌న‌వాళ్లు యూనివ‌ర్శ‌ల్ క‌థాంశాల్ని ఎంచుకుని బ‌హుభాషా చిత్రాల రూప‌క‌ల్ప‌న‌కు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో దేశ‌మంతా పాపులారిటీ ఉన్న పుల్లెల గోపిచంద్‌పై సినిమా తీయ‌డం ఆస‌క్తి రేకెత్తించేదే.

  •  
  •  
  •  
  •  

Comments