బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి పిక్ వైరల్.. కుర్రాళ్ళకు మైండ్ బ్లోయింగ్..!

Friday, January 24th, 2020, 06:46:27 PM IST

బిగ్‌బాస్3 తెలుగు సీజన్ ద్వారా పునర్నవి భూపాలం మంచి పాపులారిటీనీ సంపాదించుకుంది. అయితే ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి క్యారెక్టర్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన పునర్నవి ఆ తరువాత కూడా చిన్న చిన్న సినిమాలలో యాక్ట్ చేస్తూ వస్తుంది. ఆ మధ్య పిట్టగోడ అనే సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు కూడా పొందింది.

అయితే ఈ సీజన్ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు అక్కడ కూడా అదరగొట్టింది. తన అందాలతో ప్రేక్షకులను అలరిస్తూ, హౌస్‌లో రాహుల్ సిప్లిగంజ్‌, ఈమెకు మధ్య ఉన్న కెమిస్ట్రీ ద్వారా తెలియకుండానే మంచి పాపులర్ అయిపోయింది. అయితే షో నుంచి బయటికి వచ్చాక ఇన్‌స్టాగ్రాంలో తరచూ ఫోటోలు, పోస్ట్‌లు పెడుతూ తన అభిమానులకు మరింత దగ్గరవుతుంది. అయితే తాజాగా కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయ్యే పిక్ ఒకటి పునర్నవి పోస్ట్ చేసింది. అయితే యోగా చేస్తూ మునుపెన్నడూ లేని విధంగా ఈ పిక్‌లో పున్ను హాట్ హాట్‌గా కనిపిస్తుండడంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.