పంజాబ్ నుండి ప్రభాస్ కి పిలుపులొస్తున్నాయ్ ?

Thursday, April 12th, 2018, 09:56:08 PM IST


బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా ఇండియన్ వైడ్ గా సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ తెలుగు హీరో మాత్రమే కాదు .. ఆల్ ఇండియన్ హీరో. ఈ మధ్య ప్రభాస్ కోసం పలు బాషల సినిమాల నుండి ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా పంజాబ్ నుండి ఆయనకు ఆహ్వానాలు అందుతున్నాయి. పంజాబ్ లో అత్యంత గ్రాండ్ గా జరిగే బైశాఖి పండగ వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ ప్రభాస్ కు ఆహ్వానాలు అధిక సంఖ్యలో అందుతున్నాయట. ప్రస్తుతం సాహో సినిమాలో బిజీగా ఉండడంతో ప్రభాస్ ఆ వేడుకల్లో పాల్గొనక పోవచ్చని టాక్. గత ఏడాది ప్రభాస్ , రాజమౌళి కలిసి బైసాఖి వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ఈ సారికూడా పాల్గొనాలని వారు కోరుతున్నారు మరి.