ఎన్టీఆర్ కూతురు జగన్ తో కలుస్తోంది .. చంద్రబాబు కి పెద్ద దెబ్బ !

Tuesday, February 28th, 2017, 01:23:35 PM IST


తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగువారి అన్నగారు ఎన్టీఆర్ కుమార్తె పురందేరేస్వరి గతం లో బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి కనీసం డిపాజిట్ కూడా దక్కే సమస్యే లేదు అని గుర్తించిన ఆమె తెలివిగా సైలెంట్ గా బీజేపీ లో జాయిన్ అయిపొయింది అప్పట్లో జగన్ నుంచీ చంద్రబాబు నుంచీ ఆమెకి అంతర్గతంగా ఆహ్వానాలు అందినా కూడా ఆమె బీజేపీ కే ఓటు వేసారు. కానీ రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితి లో ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ కి భవిష్యత్తు లేదు అని అర్ధం చేసుకున్న చిన్నమ్మ ఇప్పుడు వైకాపా లోకి అడుగు పెట్టబోతున్నారు అనే వార్త హల్చల్ చేస్తోంది. ఈ వ్యవహారం మొత్తాన్నీ రోజా దగ్గరుండి నడిపిస్తున్నారు అనే న్యూస్ కూడా ఉంది. విశ్వసనీయ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం బీజేపీ రాజకీయాలు పురందరీస్వరి కి సెట్ అవ్వడం లేదు అనీ అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న ఆమె కనీసం వైకాపా లోకి అయినా వెళ్లి ఆ పార్టీ రానున్న ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ లోకల్ మంత్రి అన్నా అవుదాం అనే ఆలోచనలో ఉన్నారట.2014లో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న పురంధేశ్వరికి ఏపీలో ఆ పార్టీ ఎదుగుదలపై స్పష్టత కనిపించడం లేదని అంటున్నారు. అందుకే ఆమె త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఎమ్మెల్యే రోజా ద్వారా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వద్దకు రోజా తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.