మహేష్ సినిమా బాలయ్య భరిలోకి ?

Wednesday, February 22nd, 2017, 10:20:19 PM IST


ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 101వ సినిమా ఏమిటనే విషయం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి పలువురు దర్శకులు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫైనల్ గా ఈ సినిమా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది? అవును బాలయ్య నెక్స్ట్ సినిమా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఉంటుందని, పూరి జగన్నాధ్ ఆ మధ్య మహేష్ తో జనగణమన సినిమా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే, ఆ సినిమా చేయడానికి మహేష్ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లోకి బాలయ్యని దింపేలా ఉన్నాడు పూరి. ఇప్పటికే బాలయ్యతో ఈ సిని మా గురించి చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలిసింది. ముందు ఎన్టీఆర్ బయో పిక్ చేస్తాడని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.