మొత్తానికి పూరి జగన్నాద్ స్టార్ హీరోని పట్టేశాడోచ్ ?

Wednesday, May 23rd, 2018, 09:55:16 AM IST

మెహబూబా సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలనుకున్న పూరి జగన్నాధ్ కు నిరాశే మిగిలింది. ఎన్నో అంచలనతో విడుదలైన ఈ సినిమా భారీ ప్లాప్ ను మూట గట్టుకుంది. దాంతో పూరి పరిస్థితి అగమ్య గోచరంలో పడింది. ఇప్పటికే పూరితో సినిమా చేయడానికి మినిమం హీరోలు కూడా ముఖం చాటేస్తున్నారు .. దాంతో అయన నెక్స్ట్ సినిమా ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అయినా నేపథ్యంలో పూరి జగన్నాధ్ నెక్స్ట్ సినిమాకు సిద్ధం అవుతున్నాడు ? అదికూడా క్రేజీ హీరో నాగార్జున తో కావడం విశేషం !! గతంలో నాగార్జునతో సూపర్, శివమణి లాంటి హిట్ సినిమాలను అందించిన పూరి చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమాకు ఓకే చెప్పాడట. దాదాపు పదేళ్ల తరువాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సారి నాగార్జునతో ఎలాగైనా సరే మంచి హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. నాగార్జున ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కళ్యాణ్ కృష్ణ తో బంగార్రాజు సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి . మరి పూరి సినిమా ముందే మొదలు పెడతారా .. లేక బంగార్రాజు తరువాత ఉంటుందా అన్నది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments