విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిన పూరి ?

Tuesday, September 4th, 2018, 08:32:37 PM IST

ప్రస్తుతం వరుస ప్లాపులతో కెరీర్ లో వెనక పడ్డాడు క్రేజీ దర్శకుడు పూరి జగన్నాధ్. ఒకప్పుడు పూరి జగన్నాధ్ సినిమా అంటే టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది. పూరి సినిమాల్లో నటించేందుకు హీరోలు పోటీ పడేవారు .. కానీ ఇప్పుడు వరుస ప్లాప్స్ తో పరిస్థితి రివర్స్ అయింది. ఇప్పడు పూరి జగన్నాధ్ పేరు చెబితే హీరోలు పారిపోతున్నారు. వరుసగా తన సినిమాలన్నీ పరాజయాలు అవుతున్నా కూడా పూరి సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ఈ మద్యే తన కొడుకును హీరోగా పెట్టి మెహబూబా సినిమా తీసి చేతులు కాల్చుకున్న పూరి కాస్త బ్రేక్ ఇచ్చినట్టున్నాడు. ఆ సినిమా విడుదలై ఐదునెలల అవుతున్నా కూడా మరో సినిమా ప్రకటన చేయలేదు.

ఇప్పటికే వాస్కోడిగామా అంటూ ఓ టైటిల్ తో పూరి సినిమా చేస్తాడని .. అందులో ఎన్టీఆర్ , లేదా మహేష్ నటిస్తాడని అంటున్నారు? అయితే ఇది ఇప్పట్లో తేలే విషయం కాదు కానీ ప్రస్తుతం పూరి జగన్నాధ్ ఫోకస్ విజయ్ దేవరకొండ పై పడిందట. ఇటీవలే మనోడితో సినిమా కోసం అడిగితె వేరే సినిమాలు ఉన్నాయని చెప్పాడట .. కానీ ఇప్పుడు పూరి కి మంచి హిట్ కావలి .. అందుకే హీరో విజయ్ దేవరకొండతో అయితే బాగుంటుందన్న ఆలోచనతో రాయబారాలు సాగిస్తున్నాడట. ఈ విషయంలో వర్మ హెల్ప్ లైన్ వాడుకుంటున్నాడట. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ తాజాగా గీతా గోవిందంతో మంచి హిట్ అందుకున్నాడు. అందుకే పూరి ఫోకస్ విజయ్ పై పడింది. మరి ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments