నందమూరి వారసుడు పూరీ చేతికి చిక్కాడు! సేవ్ అవుతాడా?

Tuesday, September 26th, 2017, 04:51:24 PM IST


పూరీ జగన్నాద్ తెలుగు ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్. మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ ని తెలుగు తెరకి పరిచయం చేసిన ఆయన ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చాడు. అతని చేతిలో పడితే సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా అందులో నటించిన హీరో స్టార్ కేటగిరీలోకి చేరిపోతాడు. మహేశ్ ని పోకిరీతో, ప్రభాస్ ని బుజ్జిగాడు తో అంత వరకు చాలా నార్మల్ గా వెళ్తున్న వాళ్ళ కెరియర్ కి అదిరిపోయే బూస్టింగ్ ఇచ్చాడు. అలా ఇండస్ట్రీలో చాలా మందికి స్టార్ ఇమేజ్ తీసుకురావడంలో పూరి జగన్నాథ్ మార్క్ ఉంటుంది అని ఇండస్ట్రీలో అందరు చెప్పుకునేలా చేసాడు.

అయితే పూరీ జగన్నాథ్ ఈ మధ్య చేస్తున్న సినిమాలు అన్ని వరుసగా డిజాస్టర్ అవుతూ అతని క్రేజ్ కి క్రింది దించేసాయి. ఇండస్ట్రీలో కూడా పూరీ జగన్నాథ్ పని అయిపొయింది అని అందరు మాట్లాడుకునేలా చేసింది. తాజాగా బాలకృష్ణని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చిన ఆ పైసా వసూల్ సినిమా బాలయ్యని అతని అభిమానులు కాస్తా కొత్తగా చూసి ఎంజాయ్ చేసారు తప్ప. నిర్మాతకి మాత్రం భారీ లాస్ ని మిగిల్చింది. అయితే పూరీ జగన్నాథ్ ఇప్పుడు తన కొడుకు ఆకాష్ పూరీని హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. దానికోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్న సినిమా ఎంట్రీ గురించి. 2018 మార్చి లో మోక్షజ్న ఎంట్రీ ఉంటుందని ప్రకటించిన బాలయ్య అది ఎవరితో అనేది ఇంకా క్లేరిటి ఇవ్వలేదు. అయితే బాలయ్యకి శాతకర్ణి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన క్రిష్ చేతుల మీదుగా లాంచింగ్ ఉంటుందని అందరు అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్లేస్ లోకి పూరీ జగన్నాథ్ వచ్చి చేరాడు. పూరీ చేతుల మీదుగా మోక్ష ఎంట్రీ ఉంటే అతను స్టార్ హీరో కేటగిరీలోకి వేగంగా వెళ్తాడని ఆలోచనతో బాలయ్య ఉన్నట్లు అందరు చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో వాస్తవం ఏంటి అనేది నేరుగా బాలయ్య చెబితే కాని తెలియని నిజం.

  •  
  •  
  •  
  •  

Comments