అబ్బో .. పూరికిది మరో ఇడియట్ కానుందా ?

Tuesday, February 14th, 2017, 11:05:55 PM IST


టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ సినిమాలే బిన్నంగా ఉంటాయి. పూరి స్టైల్ అంటే హీరోలు బాగా ఇష్టపడతారు. ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం కెరీర్ కాస్త డల్ అయిన పూరి జగన్నాధ్ మళ్ళీ తన ఉనికిని చాటుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇక లెటస్ట్ గా కన్నడ, తెలుగు భాషల్లో ”రోగ్” పేరుతొ ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. లవర్స్ డే సందర్బంగా ఈ రోజు ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు? రోగ్ టైటిల్ కింద మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ తగిలించాడు. పూరి జగన్నాధ్ కెరీర్ లో అప్పట్లో వచ్చిన ఇడియట్ సినిమా మంచి స్టార్ ఇమేజ్ తెచ్చింది. రవితేజ హీరోగా ఆ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు దాదాపు అలాంటి ఫార్ములానే వాడి ఈ సినిమాను తీసాడట పూరి జగన్నాధ్. పైగా ఈ సినిమాను అప్పుడే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చూసి .. హిందీలో రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడట ? అంటే ఖచ్చితంగా పూరి జగన్నాధ్ ఈ సినిమాతో మళ్ళీ తన ఉనికిని చాట్ ప్రయత్నాలు అయితే చేస్తున్నాడని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ సినిమా పూరి కెరీర్ ని మలుపు తిప్పుతుందో లేదో చూడాలి !!