కొడుకుతో పూరీ మరో చిత్రానికి కొత్త కథ సిద్దం…

Monday, April 30th, 2018, 07:22:30 PM IST

టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్‌పూరీని మెహబూబా సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేప‌థ్యంలో జరిగిన లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. తొలి సినిమా రిలీజ్ కాకముందే ఆకాశ్‌పూరీ మరో సినిమాకు రెడీ అవుతున్నాడని ఫిలింగనగర్‌లో వార్త చక్కర్లు కొడుతున్నది. పూరీ జగన్నాథ్ ఆకాశ్ కోసం ఇప్పటికే మరో కథను సిద్ధం కూడా చేశాడట. పూరీ తన తదుపరి చిత్రాన్ని కొడుకు ఆకాశ్‌తో తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. మెహబూబూ చిత్రానికి ఆకాశ్ పడిన కష్టం చూసిన పూరీ..ఆకాశ్‌తో రెండో సినిమాను తీయాలని ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి మరి.