అర‌చేతిలో స్మార్ట్‌ వైకుంఠం అంటున్న పూరి !

Sunday, March 4th, 2018, 07:02:15 PM IST

రేడియో.. టేప్ రికార్డ‌ర్‌.. హ్యాండీ క్యామ్‌.. రికార్డ‌ర్‌.. సీడీ డిస్కులు.. ప్రింట‌ర్లు.. వ‌గైరా వ‌గైరా మారుతున్న ట్రెండ్‌ని ప‌రిశీలించారా? ప‌్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్స్ అన్నీ ఉన్న స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చేశాయి. ఒకే ఒక్క ఫోన్‌లో ఇవ‌న్నీ అందుబాటులో ఉన్నాయి. కాలంతో పాటు వ‌చ్చిన మార్పు ఇది. ప్ర‌స్తుతం రెడ్ క్యామ్‌, గ్రాఫిక్స్‌, యానిమేష‌న్స్‌, ఎఫెక్ట్స్‌, 3డి వంటి అధునాత‌న సాంకేతిక‌త రాజ్య‌మేలుతోంది. సినిమాతో టెక్నాల‌జీ అనుబంధం విడ‌దీయ‌రానిదిగా ఉంది. అయితే ఇలాంటి టెక్నాల‌జీతో అప్‌డేట్ అవుతూ సినిమాలు తీయ‌డంలో వ‌ర్మ‌-పూరి అండ్ కో చాలా ముందుంటారు. టెక్నో బాబాలు వీళ్లంతా..

లేటెస్టుగా ఓ ఆస‌క్తి రేకెత్తించే ఫోటోని షేర్ చేసిన పూరి, ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య‌ను పోస్ట్ చేశారు. 1980 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ మారిన సాంకేతిక‌త అర‌చేతిలోకి వ‌చ్చేసింది.. అంటూ వ్యాఖ్యానించారు. అవును నిజ‌మే.. ఇప్పుడంతా స్మార్ట్ యుగం. ప్ర‌తిదీ అర‌చేతిలోకి వ‌చ్చేస్తోంది. మునుముందు ఇంకా ఇంకా ఇది మారిపోనుంది. అయితే మారే ట్రెండ్‌ని అనుస‌రించి డైరెక్ట‌ర్లు మార‌క‌పోతే సినిమాలు చూసేందుకు థియేట‌ర్ల‌కు రారెవ‌రూ. మునుముందు 3డి సినిమాలు, హైఎండ్ గ్రాఫిక్ విజువ‌ల్ వండ‌ర్స్ మాత్ర‌మే చూస్తారు. క‌థ‌, కంటెంట్‌తో పాటు సాంకేతిత అత్యంత ఆవ‌శ్య‌కం. ఆర్జీవీ, పూరి ఇంకా ఇంకా అప్‌డేట్ అయ్యి 3డి విజువ‌ల్ వండ‌ర్స్ తీయాల్సి ఉంటుంది. లేదంటే మార్కెట్ ఇప్ప‌టికే కిందికి ప‌డిపోయింది కాబ‌ట్టి, అదింకా దిగ‌జార‌డం గ్యారెంటీ! పోటీ ప్ర‌పంచంతో పోటీప‌డకుండా పాత చింత‌కాయ క‌థ‌ల్ని న‌మ్ముకుంటే ఆర్జీవీ అయినా, పూరి అయినా అంతే సంగ‌తి! త‌స్మాత్ జాగ్ర‌త్త‌!!