పూరికి విగ్ర‌హం కానుక‌.. ఫ్యాన్స్ స‌ర్‌ప్రైజ్‌

Thursday, September 28th, 2017, 10:00:24 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌కి అభిమానులు అరుదైన కానుక‌నిచ్చారు. ఆయ‌న విగ్ర‌హాన్ని ఆయ‌న‌కే కానుకిచ్చి ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్ నిచ్చారు. నేడు పూరి `కేవ్‌`లో ఈ అరుదైన స‌న్నివేశం క‌నిపించింది. కాలు మీద కాలేసుకుని స్టైల్‌గా కూచుని స్మైలిస్తున్న పూరి జ‌గ‌న్నాథ్ విగ్ర‌హం ప్ర‌స్తుతం కేవ్‌కే అందం తెచ్చింది.

ఈ అభిమానం హైద‌రాబాద్ అంబ‌ర్ పేట అభిమానుల‌కే సాధ్య‌మైంది. పూరి కోసం ఏకంగా కాన్వాయిలో వ‌చ్చిన అభిమానులు విగ్ర‌హం మోసుకొచ్చి పూరికి స‌ర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు. 200 మంది అభిమానులు కేవ్‌కు చేరుకుని పూరిని ప్ర‌త్యేకంగా శాలువా క‌ప్పి స‌న్మానించి విగ్ర‌హాన్ని కానుకిచ్చారు. అంబ‌ర్‌పేట అభిమానం ఆకాశాన్ని తాకింది .. బావుంద‌య్యో పూరి… హిట్లు లేక‌పోయినా.. విగ్ర‌హాలు క‌ట్టించుకుంటున్నావ్‌?

  •  
  •  
  •  
  •  

Comments