పూరి జగన్నాథ్ ప్లాన్ మారినట్టుందే..!

Wednesday, September 5th, 2018, 03:24:20 PM IST

ఒకప్పుడు తన సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం కనీసం యావరేజ్ సినిమాలను కూడా అందించలేకపోతున్నారు. హీరోల క్యారెక్టరైజేషన్ లను తనదైన శైలిలో చూపించే పూరి గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇక నెక్స్ట్ విజయదేవరకొండ ను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సంగతి అటుంచితే తన కొడుకుతో మెహబూబా సినిమా చేసిన పూరి మరో సినిమా చేస్తానని ఇదివరకే చెప్పాడు.

అయితే ఈ సారి దర్శకుడిగా కాకుండా కేవలం నిర్మాతగా వ్యవహరించనున్నడట. తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే అనిల్ అనే యువకుడికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి వాస్కోడిగామా అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు టాక్. త్వరలోనే సినిమాకు సంబందించిన పనులను మొదలుపెట్టి అధికారికంగా తెలియజేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరి తనయుడు ఆకాష్ ఈసారైన సరైన హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments