ఛార్మి మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ ఉమెన్‌!

Wednesday, May 23rd, 2018, 10:58:00 AM IST

కింగ్ నాగార్జ‌న ఓ అంద‌గ‌త్తె దెబ్బ‌కు ప‌రేషాన్ అయిపోయార‌ని ఫిలింన‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అస‌లింత‌కీ ఎవ‌రా అంద‌గ‌త్తె అంటే .. ఇంకెవ‌రు ది గ్రేట్ చార్మి. పూరి క‌నెక్ట్స్ సీఈవోగా కీల‌క బాధ్య‌త‌లు నెర‌వేరుస్తున్న ఛార్మి ప్ర‌స్తుతం త‌న సంస్థ పురోభివృద్ధి బాధ్య‌త‌లు తీసుకుని ముందుకు సాగుతున్నారు. జ‌యాజ‌యాలు క‌ల‌చివేసేవే అయినా అలాంటివాటికి వెర‌వ‌క ఛార్మి ప‌య‌నం సాగిస్తున్నారు. ఇటీవ‌లే పూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మెహ‌బూబా` చిత్రానికి ఛార్మి 4కోట్ల పెట్టుబ‌డి పెట్టార‌న్న ప్ర‌చారం సాగింది. ఆ క్ర‌మంలోనే ఆ సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డం ఊహించ‌ని దెబ్బ కొట్టింది. అదంతా అటుంచితే పూరీపై ఛార్మికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏమాత్రం చెక్కు చెద‌ర‌లేదుట‌. ఆ క్ర‌మంలోనే కింగ్ నాగార్జున‌తో పూరి జ‌గ‌న్నాథ్ మూవీ డీల్ క్లోజ్ చేయ‌డంలో కీల‌క బాధ్య‌త వ‌హించార‌ట‌. కింగ్‌తో మంత‌నాలు సాగించి పూరితో ప్రాజెక్టును ఫైన‌ల్ చేసింది ఛార్మియేన‌ని తెలుస్తోంది. పూరి జ‌గ‌న్నాథ్- నాగార్జున కాంబినేష‌న్‌లో గ‌తంలో సూప‌ర్‌, శివ‌మ‌ణి వంటి చిత్రాలు వ‌చ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ డీల్‌లో ఛార్మి కీల‌క బాధ్య‌త వ‌హించ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇప్పుడ‌ర్థ‌మైందా? పూరి-ఛార్మి మ‌ధ్య స్నేహానుబంధం ఎంత‌టి మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్లో?

  •  
  •  
  •  
  •  

Comments