కొడుకు కోసం ఆస్తులమ్ముకుంటున్న పూరి ?

Monday, May 7th, 2018, 10:52:07 PM IST


ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలన్న నిజం ఈ దర్శకుడికి బాగా తెలుసు .. అందుకే ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతుక్కునే పని మొదలు పెట్టి సక్సెస్ అయ్యాడు. ఇక పోగొట్టుకున్నది వెతుక్కుని నిలబడ్డాడు .. ఇప్పుడు ఎక్కడ సంపాదించామో అక్కడే పోగొట్టుకోవాలని అనుకున్నాడేమో .. అందుకే తాను సంపాదించుకున్నదాన్ని తన కొడుకును హీరోగా నిలబెట్టడం కోసం ఫణంగా పెడుతున్నాడు. ఈ కథ మొత్తం ఎవరిదో మీకు ఈపాటికే అర్థం అయి ఉంటుంది కదా .. ? అవును అతనే దర్శకుడూ పూరి జగన్నాధ్. అయన తనయుడు ఆకాష్ హీరోగా మెహబూబా సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే అంచనాలను పెంచేసిన ఈ సినిమాతో అటు కొడుకు హీరోగా తండ్రి దర్శకుడిగా ఫామ్ లోకి రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెహబూబా సినిమా కోసం పూరి సొంత ఇల్లు కూడా అమ్మేసాడని వార్తలు వస్తున్నాయి? ఆస్తులకంటే ఆశయాలు ముఖ్యమని నమ్మే పూరి జగన్నాధ్ .. తన కెరీర్ ని జీరోతో స్టార్ట్ చేసాడు .. కాబట్టి మళ్ళీ అదే కాన్ఫిడెన్స్ తో ఆస్తులు అమ్మి మరి తన కొడుకును హీరోగా పెట్టి సినిమా చేసాడు. మరి ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరికి మెహబూబా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments