సునీల్ – పూరి జగన్నాధ్ ల మధ్య డీల్ కుదిరిందా ?

Friday, November 4th, 2016, 12:37:35 AM IST

suni-and-puri-jagan
అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు? పూరి జగన్నాధ్ లెటస్ట్ గా రూపొందించిన ”ఇజం” .. సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో పాటు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరి జగన్నాద్ కు కూడా సరైన విజయం రాలేదు. ఇక ఈ మధ్య సునీల్ కు కూడా కెరీర్ అలాగే ఉంది. ఇప్పటికే సునీల్ ఎన్ని సినిమాలు చేసినా కూడా లాభం లేకుండా పోయింది. లేటెస్ట్ గా ”ఈడు గోల్డెహే” సినిమా కూడా భారీ ఫ్లాప్ అవడంతో అయన నెక్స్ట్ సినిమా ఏమిటనే సందేహాలు ఎక్కువయ్యాయి. ఇక వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అయినట్టు సమాచారం. పూరి జగన్నాధ్, సునీల్ తో ఓ హిట్ సినిమా తీస్తానని మాటిచ్చాడట !! దాంతో పాటు అందరు కొత్త వాళ్లతో కూడా సినిమాలు తీయాలని పూరి ఫిక్స్ అయినట్టు తెలిసింది. మొత్తానికి పూరి జగన్నాధ్ – సునీల్ ల మధ్య కుదిరిన ఈ డీల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక సునీల్ ప్రస్తుతం మలయాళ రీమేక్ ”టూ కంట్రీస్” రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పూరి – సునీల్ ల సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది?