తగ్గేదేలే.. యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్ చేసిన పుష్ప టీజర్..!

Saturday, June 5th, 2021, 02:00:16 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “పుష్ప”. బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ఆర్య, ఆర్య-2 సినిమాలు మంచి హిట్ కొట్టడంతో ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఈ జోడీ. అయితే ఈ సినిమా విడుదల కాక ముందే రికార్డుల మోత మోగిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, మోషన్ పోస్టర్, అల్లు అర్జున్ లుక్, డైలాగ్స్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి.

అయితే ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘ఇంట్రడ్యూసింగ్‌ పుష్పరాజ్‌’ పేరుతో వచ్చిన టీజర్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 50 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టిన టీజర్లు టాలీవుడ్‌లో చాలా తక్కువే. అయితే ఈ టీజర్ ఏకంగా 70 మిలియన్ల వ్యూస్‌ను మొదటిసారిగా మరియు వేగంగా కొల్లగొట్టింది. అలాగే ఈ టీజర్ 1.6మిలియన్ల లైకులను సొంతం చేసుకుంది.