బంపర్ ఆఫర్ కొట్టేసిన పీవీ సింధు…

Saturday, February 9th, 2019, 11:20:14 AM IST

ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఒక విదేశీ సంస్థతో 50 కోట్ల విలువైన ఒప్పందాన్ని సొంతం చేసుకుంది. చైనాకు చెందిన క్రీడాపరికరాల సంస్థ లీ నింగ్‌తో పీవీ సింధ 50 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కాగా వీరి మధ్యన కుదిరిన ఒప్పందం మాత్రం నాలుగు సంవత్సరాలు కొనసాగనుంది. సింధు అందుకున్న ఈ ఆఫర్, ప్యూమాతో కోహ్లీ కుదుర్చుకున్న ఒప్పందంతో సమానమని చెప్పవచ్చు. లీ నింగ్ తో సింధు కొట్టేసిన ఈ ఆఫర్ రెండవది. 2014-15లో 1.25 కోట్లని రెండు సంవత్సరాల సమయానికి చెల్లించింది.

2016లో యోనెక్స్‌తో జతకట్టిన సింధు ఏడాదికి రూ. 3.5 కోట్లు చెల్లించే విధంగా మూడు సంవత్సరాలకి ఒప్పందాన్ని అంగీకరించింది. అలాగే పారుపల్లి కశ్యప్‌కు రెండేండ్లకు రూ. 8 కోట్లు, శ్రీకాంత్‌తో కూడా లీ నింగ్ రూ. 35 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతేకాకుండా పురుషుల డబుల్స్ జోడీ మను అత్రి-సుమిత్ రెడ్డిలతో కూడా లీ నింగ్ రెండేళ్ల కాలానికి చెరో రూ. 4 కోట్లతో ఒప్పదం చేసుకున్నది. గతేడాది భారత ఒలింపిక్ అసోసియేషన్‌తో ఒప్పందం చేసుకున్న లీ నింగ్.. అందులో భాగంగా 2020 ఒలింపిక్స్ కోసం అధికారులకు, క్రీడాకారులకు శిక్షణ దుస్తులు, షూస్, రాకెట్లను సరఫరా చేస్తున్నది. ఏదేమైనా కూడా మన దేశ ఆటగాళ్లు విదేశీ మార్కెట్ని కూడా శాశిస్తున్నారనే చెప్పవచ్చు.